వేమూరి రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి. అయితే ఆయన మిగిలిన అందరు పత్రికాధిపతుల కన్నా చాలా భిన్నం.. ఎలాగంటే.. ఆయన స్వతహాగా ఓ విలేకరి. విలేకరి స్థాయి నుంచి పత్రికను కొనే స్థాయికి ఎదిగి.. ఒకప్పుడు మూతపడిన ఆంధ్రజ్యోతిని తెరిపించి నడిపిస్తున్నారు. అయితే పత్రికను నడిపించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందుకునే క్రమంలో ఆయన తెలుగు దేశానికి బాగా దగ్గరయ్యారని చెబుతుంటారు.

 

 

ఓ పత్రికకు ఓ స్టాండ్ ఉంటుంది. దాన్ని తప్పుబట్టలేం. కానీ.. రాధాకృష్ణ ఇటీవల తన రాతల్లో తరచూ కుల రాజకీయాలపై పదే పదే ప్రస్తావిస్తున్నారని.. ఆయనకు కమ్మ కుల పిచ్చి కరోనా కంటే భయంకరంగా ముదిరిందని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ సీఎం జగన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేసుకున్నారని.. కమ్మ కులస్తునుల వేధిస్తున్నారని తన కొత్త పలుకు సంపాదకీయంలో రాసుకొచ్చారు.

 

 

అయితే.. వాస్తవానికి కమ్మ కులం సమాజానికి చాలా మేలు చేసిందంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు వరకూ చాలా మంది కమ్మ ప్రముఖులు సమాజ సేవ చేశారని గుర్తు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి స్వతహాగా కష్టపడే తత్వం.. వీరికి కొంత తెలివితేటలు అధికమనే చెప్పాలి. అందరినీ కలుపుకుపోయే తత్వం వల్ల.. టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు.

 

 

గతంలో అనేక మంది కమ్మవారి అనేక సంస్థలు నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పించారు. అంతే కాదు..వీరికి సమాజం పట్ల కృతజ్ఞత కూడా ఉంటుంది. సమాజ సేవలోనూ ముందుంటారు. విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో లాభం చాలా తక్కువ చూసుకుని సేవలు అందించారు. అంతా బాగానే ఉంది.. ఎన్టీఆర్ కాలం వరకూ బాగానే ఉంది. కానీ చంద్రబాబు తర్వాత కాలంలో కులం బాగా పెరిగిందంటున్నారు సీనియర్ జర్నలిస్టులు.

 

రాధాకృష్ణ వంటి వ్యక్తుల కారణంగా.. ఏపీలో కమ్మ వారంటేనే మిగిలిన కులాలు ద్వేషించే పరిస్థితి వచ్చిందని.. వీరు తమకు ఉన్న కుల పిచ్చిని అందరికీ అంటిస్తారని అంటున్నారు. ఇప్పటికైనా సరే.. రాధాకృష్ణ ఇలాంటి కుల పిచ్చి తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: