అవును తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి నిర్ణయానికి కూడా వెనుకాడటం లేదు. ఏ నిర్ణయం అయినా సరే ఆయన తీసుకోవడాని కి సిద్దంగా ఉన్నారు. ఏ స్థాయి లో నిధులు కావాలి అన్నా సరే వేగంగా విడుదల చేయడం తో పాటుగా ఆస్పత్రుల సంఖ్య పెంచడం అదే విధంగా వైద్య సిబ్బంది కి అందించే పరికరాల నుంచి మొదలుపెడితే ప్రతీ ఒక్కటి కెసిఆర్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రాకు తెలంగాణకు వ్యాపారం ఎక్కువ. ఉల్లి పాయ నుంచి ఉప్పు పప్పుల వరకు అక్కడి నుంచి తెలంగాణా దిగుమతి చేసుకుంటుంది. 

 

కాని కెసిఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా దాని మూసి వేసారు. మహారాష్ట్ర సరిహద్దులను మూసి వేయడంలో కెసిఆర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాలలో తెలంగాణా మహారాష్ట్ర సరిహద్దు విస్తృతంగా ఉంది. దానిని కెసిఆర్ వెంటనే ఆపేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే ఆపేశారు అధికారులు. చిన్న బండి వచ్చినా సరే తెలంగాణలోకి అనుమతి ఇవ్వలేదు అధికారులు. దీనిపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను మూసి వేస్తారని ఎవరూ అనుకోలేదు. 

 

ఖమ్మం, నల్గొండ, గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆంధ్రా సరిహద్దు ఉంది. ఆంధ్రా నుంచి చాలా మంది నిత్యం తెలంగాణకు వస్తూ ఉంటారు. అయినా సరే తెలంగాణా ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఎక్కడిక్కడ అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసి వేసారు. ఇక భారీగా నిధులు కేటాయించడమే కాదు... రేషన్ సరుకుల ద్వారా ప్రజలకు ఇచ్చే రేషన్ గురించి స్పష్టంగా చెప్పారు కెసిఆర్. ప్రజలు ఎవరూ కూడా ఆకలి తో ఇబ్బంది పడవద్దు అని కోరారు. అందుకే రేషన్ ని పంచి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆయన. దీనిపై ఇప్పుడు పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: