ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకులా వనికిస్తూ ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది కరోనా  వైరస్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ భయాందోళనకు గురిచేస్తుంది. ఇక కొన్ని దేశాల్లో అయితే మరణ మృదంగం మోగిస్తూ మృత్యువుతో పోరాడేలా  చేస్తుంది. ఇక ఈ వైరస్ కు  సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం చాలామంది ప్రజలు సరైన వైద్యం లేక  చనిపోతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాలు రాష్ట్రాలు అనే తేడా లేకుండా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా స్వీయ  నిర్బంధంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు స్వీయ  నిర్బంధంలోకి వెళ్లాయి. 

 

 

 ఇక భారతదేశంలోని పలు రాష్ట్రాలు కూడా లాంగ్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా దేశాలకు దేశాలే లాక్ డౌన్  కావడంతో పాటు పలు రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. వైరస్ వ్యాప్తిని  అరికట్టేందుకు ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా... బయట ఉన్న వైరస్ బయటనే నశించే విధంగా కీలక చర్యలు చేపడుతున్నాయి. అయితే తాజాగా దేశాలు రాష్ట్రాలు వైరస్ తీవ్రతను తగ్గించేందుకు లాక్ డౌన్ ప్రకటిస్తున్న నేపథ్యంలో... దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కేవలం లాగ్ డౌన్  ప్రకటించినంత ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను ఓడించ లేము అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

 

 

 

 ఈ ప్రాణాంతకమైన మహమ్మారి పై పోరాటం చేసి విజయం సాధించాలని అంటే  మొదట ఆయా ప్రాంతాల్లో కరోనా  వైరస్ బారిన పడిన వారిని.. అనారోగ్యం పాలైన వారిని గుర్తించాలి అంటూ సూచించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ హై రిస్కు నిపుణుడు మైక్ ర్యాన్ . ఇక వారందరినీ గుర్తించిన తర్వాత వారిని ఐసోలేషన్ లో ఉంచి వైరస్ బయటికి వెళ్లకుండా చేయాలని వివరించారు. అంతేకానీ వైరస్ సోకిన వారిని గుర్తించకుండా... లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక లాక్ డౌన్  ప్రకటించినన్ని  రోజులు వైరస్ కాస్త కంట్రోల్లోనే ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ ఎత్తి  వేయగానే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ హైరిస్క్ నిపుణులు మైక్ ర్యాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: