ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో రోజురోజుకు ప్రపంచంలో దేశాలు మొత్తం భయాందోళనలో మునిగిపోతున్నాయి. కంటికి కనిపించని మహమ్మారి ఎటునుంచి దాడి చేస్తుందో తెలియడం లేదు కానీ ప్రాణాలను హరించుకుపోతుండడంతో... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతున్నారు . ఇక రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తూ  ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. దీంతో కొన్ని దేశాలలో అయితే రోజురోజుకూ పరిస్థితి కాస్త చేయి దాటి పోతుంది. ఇక కరోనా  వైరస్ నియంత్రణకు ఇప్పటికే ప్రపంచ దేశాలు నిర్బంధంలోకి వెళ్లి పోతున్న విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎవరు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఉండేందుకు స్వీయ నిర్బంధాన్ని  ప్రకటిస్తూ కఠిన ఆంక్షలను  అమలు లోకి తెలుస్తున్నాయి. 

 

 

 అయితే తాజాగా రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశ పౌరులందరికీ రెండు ఆప్షన్లు ఇచ్చింది.... 15 రోజులు ఏంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే హాయిగా గడుపుతారా... లేదా ఇంటి నుంచి బయటకు వచ్చి ఐదేళ్లు జైలు లో గడుపుతారా  అంటూ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాస్తవంగా అయితే కరోనా  వైరస్ సోకిన వ్యక్తి 14 రోజుల వరకు సాధారణ మనిషి లాగానే ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఆ వ్యక్తిలో 14 రోజుల తర్వాత కరోనా  వైరస్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే దేశపౌరుల అందరూ పదిహేను రోజులపాటు నిర్బంధం లోనే ఉండాలి అంటూ రష్యా అధ్యక్షుడు స్టేట్మెంట్ జారీ చేశారు. 

 

 

 కరోనా  వైరస్ లక్షణాలు బయట పడితే వారి నుండి ఇతరులకు సోకకుండా ఉండడానికి 15 రోజుల పాటు నిర్బంధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 15 రోజుల పాటు 14 గంటలు ఇంటికి మాత్రమే పరిమితం కావాలని రష్యా  ప్రభుత్వం సూచించింది. అయితే ఇలా 14 గంటలు మాత్రమే ఇంటికి పరిమితం కావడం వల్ల కొంత మాత్రమే ప్రయోజనం ఉన్నప్పటికీ ఒకేసారి 24 గంటల కర్ఫ్యూ విధిస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ముందుగా 14 గంటలు మాత్రమే పెట్టారని... త్వరలో దీన్ని పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా, ఇటలీ లలో  నెలకొన్న పరిస్థితులు రష్యాకు రాకుండా ఉండాలి అంటే పదిహేను రోజులపాటు నిర్బంధం పాటించాల్సిందే అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా రష్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: