భారత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ ని పాటించమని పిలుపునిస్తే... ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఆ కర్ఫ్యూ ని ఈ నెలాఖరు వరకు అనగా మార్చి 31 అర్ధరాత్రి వరకు కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఇంకా మిగతా తొమ్మిది రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కొరకే తీసుకున్నప్పటికీ కొంతమంది మాత్రం తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఈ లాక్ డౌన్ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు జీతాలు ఇవ్వాల్సిందిగా కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. కానీ దాదాపు పది రోజులు రాష్ట్రాన్ని బంద్ చేస్తే రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు ఎలా బతుకుతాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కేవలం 1500 రూపాయలు ఇస్తే సరిపోతాయా? అని చాలామంది ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఈ కోవలోకే బుల్లితెర యాంకర్ అనసూయ కూడా తాజాగా వచ్చేసింది. అందుకు కారణం బుల్లితెర షూటింగులు, ఈవెంట్ కార్యక్రమాలతో పాటు వెండితెర షూటింగులు ఆగిపోవడం.



వివరాలు చూసుకుంటే... తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న సామాజిక మాధ్యమాలలో ' గౌరవనీయులైన తెలంగాణ సీఎం కెసిఆర్ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు. రెండు కోట్ల 83 లక్షల మందికి ఉచిత రేషన్ బియ్యం, 1500 రూపాయలను ఇవ్వనున్నారు. రూ. 2, 417 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది' అని చెప్పుకొచ్చారు.




అయితే యాంకర్ అనసూయ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... 'సర్... కొన్ని వృత్తులను పరిశీలిస్తే... మేము పనికి వెళ్ళలేకపోతే... మేము ఆదాయాన్ని సంపాదించలేము. కానీ మేము మాత్రం యధావిధిగా ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇఎంఐలు వంటి నెలవారీ తప్పనిసరి ఖర్చులు భరించాలి.ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, కొందరి విషయంలో మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను' అని సోషల్ మీడియాలో పేర్కొంది.





అయితే అనసూయ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏసీ కార్లలో తిరిగే నీకు కరెంటు బిల్లు కట్టే డబ్బులు లేక పోయాయా? వారం రోజులు పనికి వెళ్ళకపోతే పోయేదేమీ లేదు కానీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే దేశంలోని ప్రతి ఒక్కరి ప్రాణాలకే ముప్పు. చదువుకున్న దానివి నీకు ఈ మాత్రం ఆలోచించే శక్తి లేకపోతే ఎలా? కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది. మీరు ఇలాంటి తప్పుడు రాతలు రాయకండి. కూలి నాలి చేసుకునేవారు కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు. మీకేం పోయేకాలం అంటూ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజనులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: