ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం పెరుగుతూ వస్తుంది.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు... అలాంటి కరోనా పై నియంత్రణకు పూనుకున్నారు..

 

 

 

గతంలో పెళ్లంటే ఊరందరినీ పిలిచి గొప్పగా చేసుకునేవారు. పెళ్లి ఎంత మంది అతిథులొస్తే అంత గొప్పగా చెప్పుకునేవారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ పరిస్థితి తారుమారు అయింది. పెళ్లికి ఎక్కువ మంది అతథులను పిలిస్తే ఇప్పుడు ఏకంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కేరళలో ఇలాగే ఓ పెద్దాయన తన కూతురి పెళ్లిని ఏకంగా వేయి మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

 

 

 

కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది.. ఈ మేరకు పెళ్లిళ్లు పార్టీలను రద్దు చేసింది .. అయిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపాడు.. 1000 మందికి పైగా బంధువులను పిలిపించి ఆయన ఘనంగా వివాహాన్ని జరిపించారు.. అయితే ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తూ అల్లప్పుజా నగరంలోని అరాట్టువాజీ ప్రాంతానికి చెందిన షమీర్ అహ్మద్ ఇటీవల తన కుమార్తెకు టౌన్ హాలులో జరిపించారు..

 

 

ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించారు.. వివాహానికి 60 మందికి మించి అతిథులను ఆహ్వానించొద్దని తహసీల్దార్ ఆదేశించినా అహ్మద్ పట్టించుకోలేదు. తన బంధువులతో పాటు నగరంలోని స్నేహితులు, పరిచయస్తులందరినీ ఆహ్వానించి ఘనంగా కూతురి పెళ్లి జరిపించాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన అతడిపై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కూడా ఇలా చేయొద్దని తెలియజేసిన కూడా ఆయన మొండిగా చేయడంపై పోసులు అదుపులోకి తీసుకున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: