మాస్క్ వేసుకోవడం లో నష్టాలూ ఉన్నాయిట. తస్మాత్ జాగ్రత్త...! అయితే ఈ కరోనా వైరస్ వచ్చేగానే ప్రజలంతా మాస్కులు కొనడానికి షాపులు మీద పడ్డారు. ముందు వెనుక చూడకుండా మాస్కులు కొనడానికి వెళ్లి కొనేశారు. ఎందుకు ఇది అని ఆలోచించకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు మాస్కులు ధరించారు. కానీ మాస్కు సరిగ్గా ధరించకపోతే ఎంతో ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

 

 

ప్రస్తుత పరిస్థితిలో మాస్కు ధరించక పోవడమే మంచిది అని చెబుతున్నారు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే మాస్కు ధరించి అస్తమానం సర్దుకోవడం మరెంతో ఇబ్బంది వస్తుంది అని చెప్పారు. అలానే చేతులని కూడా శుభ్రంగా ఉంచుకోలేరు అంటూ డాక్టర్లు చెప్పారు.

 

ఎవరు పడితే వాళ్ళు మాస్కు వేసుకోవడం అవసరం లేదు అని చెప్పారు. మాస్క్ ఎవరు వేసుకోవాలి అంటే చికిత్స చేసే డాక్టర్లు వంటి వాళ్ళు మాత్రమే అన్నారు. అలానే సాధారణ వ్యక్తులు ఈ మాస్క్ ధరిస్తే అటు ఇటు వేళ్ళతో జరపడం  గోళ్ళల్లో ఉండే క్రిములు ముక్కు నుండి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. ఇది చాలా ప్రమాదం. అయితే ఈ కరోనా ఖండాలు దాటి దేశాలు దాటి అన్ని రాష్ట్రాలలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ప్రాణాలతో ఆడుకుంటంది.

 

 

అనేక మందిని బలి తీసుకుంటోంది. అయితే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. కాబట్టి భయం లేకుండా నా వరకు రాదులే అని సింపుల్ గా తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇష్టాసారంగా నచ్చిన మాస్కులని కొనుక్కుని వాడుతూ అనవసరంగా ముప్పు తెచ్చుకోకండి . ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం అత్యవసరం కాదు. ఇందులో లాభాలు కంటే  నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలుసుకోవాలి. కాబట్టి డాక్టర్లు చెప్పినది పాటించి ఆరోగ్యంగా  ఉండడం ప్రధమం . 

మరింత సమాచారం తెలుసుకోండి: