టీడీపీ  కీలక నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్ సర్కార్ పై ఎప్పుడూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిన్న అవకాశం దొరికితే చాలు జగన్ సర్కార్ పై విరుచుకు పడుతూనే ఉంటారు . ప్రతిపక్ష టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు బుద్ధ వెంకన్న. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ అధికార పార్టీ నేతలకు కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ సందర్భంగా లాక్డౌన్  నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి  వెయ్యి రూపాయలు ఇస్తాము  అంటూ జగన్ సర్కార్ ప్రకటన చేసింది. అయితే ఈ అంశం పైన స్పందించిన ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు. కరోనా  వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో పేదల జీవితాలన్ని తారుమారు  అవుతుంటే... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి మాత్రం పేదలకు సహాయం చేయడానికి పెద్దమనసు రాలేదా అంటూ మండిపడ్డారు. తొమ్మిది రోజుల పాటు లాక్ డౌన్  రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకటించిన ప్రభుత్వం... పేదలకు కూలీలకు పని దొరికే అవకాశాలు లేకపోవడంతో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా అని ప్రశ్నించారు. బియ్యం కందిపప్పు వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తే పేదల జీవితం గడిచి పోతుందా  అంటూ నిలదీశారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. 

 

 

 రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదల అందరికీ... 20 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు వేల రూపాయలు అందించాలి అంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు బుద్ధా వెంకన్న . అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  విధించిన నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యవసర వస్తువులు రేషన్ ద్వారా అందించాలని అంటూ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి ఎన్నికలను వాయిదా వేయకుంటే ... రాష్ట్రంలోని వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: