కరోనా దెబ్బ గట్టిగా తగిలిన దేశాల్లో అమెరికా కూడా ఒకటి. ఆ దేశంలో ఒక్క రోజే... ఆదివారం ఒక్క రోజే 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వేలాది మంది ప్రజల్లో కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే అమెరికాలో వంద మందికి పైగా కరోనా తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి చేయి దాటినట్టే కనపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే వ్యాధి ప్రభాలడం మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు అక్కడ కూడా ప్రజలు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు బ్రతికితే చాలు అనుకునే పరిస్థితి. 

 

మందు కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్న అమెరికా ఇప్పటి వరకు పురోగతి సాధించడం లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనితో పరిస్థితి ఆసలు అక్కడ అదుపులోకి వస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి. దాదాపు 40 వేల కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. సాక్షాత్తు వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా సోకింది. దీనితో ఇప్పుడు ఈ మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కోవాలో అగ్ర రాజ్యానికి అర్ధం కావడం లేదు. ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో ట్రంప్ సర్కార్ కి తెలియడ౦ లేదు. కరోనా వ్యాక్సిన పరిక్షలు కూడా అంతగా ఫలించ లేదు. 

 

దీనితో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటీ అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా ఇప్పుడు ఏ విధంగా దీనిని ఎదుర్కుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. వేలాది మంది దీని బారిన పడుతున్నారు. కరోనా ఆగేలా కనపడటం లేదు. వాతావరణం చల్లగా ఉండటంతో అది మరింతగా రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి ఏ విధంగా అడుగులు వెయ్యాలో అమెరికాకు అర్ధం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: