కరోనా వైరస్ తీవ్రతకు ఇటలీ ఇప్పుడు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పుడూ ముందు ఉండి, పౌరుల భద్రతకు అత్యంత విలువ ఇచ్చే ఇటలీ లో ఇప్పుడు పరిస్థితి అంచనా వేయలేకుండా ఉంది. ఎన్ని విధాలుగా అక్కడ చర్యలు తీసుకుంటున్నా సరే ఇది మాత్రం అదుపు కావడం లేదు అనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. కరోనా తీవ్రత ఇటలీ ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు భయపడిపోతుంది. ఉత్తర ప్రాంతంలో దీని తీవ్రత అంచనా వేయలేకుండా ఉన్నారు. 

 

ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయో అంచనా లేదు. అసలు ఎంత మందికి చికిత్స అందిస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. చైనాలో పుట్టినా సరే ఇటలీ మీదే ఎక్కువగా కరోనా పంజా విసిరింది. యూరప్ దేశాల్లో అత్యంత అభివృద్ధి చెందిన దేశం అది. దేశ జనాభా కూడా పెద్దగా లేరు. ఆరు కోట్ల మంది మించి లేరు అక్కడ. కాని విస్తీర్ణం పరంగా చూస్తే పెద్ద దేశం. అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ. అయినా సరే ఇది మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు అనే చెప్పాలి. ఇటలీ ని కరోనా తుడిచిపెట్టేస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. 

 

అక్కడ ఎటు చూసినా సరే శవాలే కనపడుతున్నాయి. ఎన్ని వేల మందిని కాల్చినా సరే ఇంకా కరోనా మరణాలు అదుపులోకి రావడం లేదు. వేలాది శవాలు ఖననం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటలీ లో లాక్ డౌన్ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. కరోనా దెబ్బకు అక్కడి ప్రజలు కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా కట్టడి కావడం అనేది ఇప్పుడు ఆ దేశంలో కష్టమే అని అంటున్నారు. అక్కడ 80 ఏళ్ళు దాటిన వారికి వైద్యం చేయడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: