దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి . ఇక ఈ కరోనా  వైరస్ ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టి శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్  ప్రకటించారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏకంగా మార్చి 31 వరకు తొమ్మిది రోజులపాటు లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. రేషన్ సరుకులు  పెంచడంతో పాటు కొంత మొత్తంలో నగదును కూడా అందజేసేందుకు నిర్ణయించిన  విషయం తెలిసిందే.

 

 

 ఒక వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణ యించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు... ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి వెయ్యి రూపాయలు... తెలంగాణలో 1500 రూపాయలు ఇస్తాను అంటూ  ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు  ప్రకటించారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్  నేపథ్యంలో నగదు ఎలా ఇస్తారు అన్న దానిపై ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కసరత్తులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నగదును చేతికి ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజల వివరాలు సేకరించి నగదును ఖాతాల్లో జమ చేయాలని భావించారట. 

 

 కానీ గతంలో సేకరించిన తెల్ల రేషన్ కార్డు వివరాల్లో ఎన్ని ప్రస్తుతం పనిచేస్తున్నాయో తెలుసుకోవడం కాస్త కష్టతరమైన పని కావడం... అంతేకాకుండా ప్రస్తుతం బ్యాంకుల్లో ఉద్యోగులు కూడా తక్కువ మొత్తంలో పనిచేస్తుండడం.. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పటికీ మళ్ళి ప్రజలు బ్యాంకులకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున... నేరుగా లబ్ధిదారులకు చేతికే ప్రభుత్వం ప్రకటించిన సొమ్మును ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: