కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్క సెలబ్రేటి స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నారు. క్రికెట్ సెలబ్రిటీలు కూడా ట్రైనింగ్ మ్యాచ్ లు గట్రా లేకుండా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయితే ఈ క్వారంటైన్ టైం లో వారు ఎక్కువగా సోషల్ మీడియా లో గడుపుతున్నారు. ఇందులోనే భాగంగానే రోహిత్ శర్మ కూడా సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఆదివారం రోజు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చూసి తెగ బాధపడ్డాడు.




ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టి వివియన్ రిచర్డ్, రికీ పాయింటింగ్, హెర్షెల్ గిబ్స్‌తో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోలను జతచేసి... ఈ నలుగురి బ్యాట్స్ మెన్స్ లలో ఫుల్ షాట్ అత్యుత్తమంగా ఆడేది ఎవరని ప్రశ్నించింది. అయితే రోహిత్ శర్మ ఈ పోస్ట్ ని చూస్తూ నేను కూడా ఫుల్ షాట్ అత్యుత్తమంగా ఆడగలను కదా మరి నా పేరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అంటూ కాస్త అలకతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ పోస్ట్ కింద కామెంట్స్ విభాగంలో కూడా రోహిత్ కి సపోర్ట్ చేస్తూ అతనికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజనులు.




కొద్ది సమయం గడిచిన తర్వాత ఐసీసీ రోహిత్ శర్మ బాధను అర్థం చేసుకొని... మీరు కూడా ఫుల్ షాట్ ఆడటంలో ఉత్తములే అంటూ ఒక వీడియో ని రిప్లై రూపంలో తెలియపరచింది. ఏది ఏమైనా ఒక ఆటగాన్ని గుర్తించకుండా తప్పుచేసి అందరి ఆగ్రహానికి ఐసీసీ కారణమవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ టైం పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఐసీసీ ముందడుగు వేస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ఐపీఎల్ కూడా వాయిదా పడిందన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: