దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ  పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మీ జీవితంలోని ఒక రోజు నాకు కేటాయించండి మీకు ఎదురైన సమస్యలను తరిమికొడదాం  అంటూ తెలిపారు. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అందరూ ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేదు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ  ను విజయవంతంగా పాటించారు దేశ ప్రజలు. ఇలా ఇళ్లల్లో కూర్చొని హాయిగా కుటుంబంతో గడుపుతూనే ప్రాణాంతకమైన కరోనా వైరస్ పై పోరాటం చేశారు. 

 

 

 అయితే జనతా కర్ఫ్యూ  భాగంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రతి ఒక్కరు తమ ఇంటి గుమ్మం వరకు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాలి  అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ను ఎదిరించేందుకు పోరాడుతున్న... నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు సహా అందరికీ స్ఫూర్తిని ఇచ్చేందుకు ఇలా దేశ ప్రజలు చప్పట్లతో అభినందించారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో చాలా మంది చప్పట్లు  కొట్టడమే కాకుండా వివిధ రకాలుగా శబ్దం సృష్టించారు. ఇక కొంతమంది అయితే ఏకంగా నృత్యాలు కూడా చేశారు. 

 

 

 ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి వీడియోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓనీర్  తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారిపోయింది. ఇది పోస్ట్ చేసిన దర్శకుడు ఆ దృశ్యం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారతదేశంలోని పలు ప్రాంతాలలో కొంతమంది మూర్ఖులు ఐదు గంటలకు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇలా నృత్యాలు చేసిన వారందరూ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన  జనతా కర్ఫ్యూ కి  తలవంపులు తెచ్చారు అంటూ మండిపడ్డారు ఆయన. అయితే బాలీవుడ్ దర్శకుడు తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు పెట్టిన పోస్ట్ పై కూడా సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: