కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే.. పదికి పైగా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ అంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించాయి.  దేశంలో వైరస్‌‌‌‌‌‌‌‌ ప్రభావమున్న 75 జిల్లాలను లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు కేంద్రం ఆదివారం ప్రకటించింది. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు చర్యలు ముమ్మరం చేశాయి.  1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే, మొదటగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు. ఇప్పటికీ ఈ పనిపై అధికారులు సిద్దంగా ఉన్నారు. 

 

కేవలం అత్యవసరం అయినవి మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ మార్చి 31 వరకు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో 31 వరకు  లాక్‌డౌన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు 13 రాష్ట్రాలు ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, నాగాలాండ్, రాజస్థాన్,చత్తీస్‌‌గఢ్‌‌ నిర్ణయం తీసుకున్నాయి.  ఈ మేరకు ఆదివారం ఆ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 75 జిల్లాల్లో మార్చి 31 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

 

ఈ జిల్లాల్లో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కాబోతున్నాయి. అయితే ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ ఉండటం, కరోనా భయాలతో ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. ప్రయాణాల డిమాండ్ కూడా విపరీతంగా పడిపోవడంతో.. ప్రయాణించే విమానాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.   లాక్ డౌన్ నేపథ్యంలో పలు జిల్లాల్లో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కాబోతున్నాయి. కేబినెట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు, ప్రధాని మోడీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: