కరోనా వైరస్ మరింత ప్రబలకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే బాధితులు మాత్రం క్వారంటైన్ పూర్తికాకుండానే ప్రయాణాలు మొదలెట్టేశారు.. దాంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి వారి విషయాల్లో సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్ చేసేందుకు ఓ ఆసుపత్రి ని పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందుకోసం హైదరాబాద్‌‌‌‌లోని కింగ్‌‌‌‌ కోఠి ఆసుపత్రిని ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆ ఆసుపత్రి ఇప్పటికే ఉన్న పేషెంట్లను సమీపంలోని ఇతర దవాఖానాలకు షిఫ్ట్ చేస్తున్నారు.

 

రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ హాస్పిటళ్లకు పదుల సంఖ్యలో అనుమానితులు వస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్​ పాజిటివ్​గా గుర్తించిన పేషెంట్ల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వారు ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ దేశం నుంచి వచ్చారన్నది తెలియజేసింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో మొత్తంగా 27 మందికి పాజిటివ్​గా గుర్తించగా.. మొదటి పేషెంట్​ఒక్కరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 27 మందిలో పది మంది ఇండోనేషియా పౌరులే. మిగతా వారిలోనూ ఇద్దరు తప్ప అంతా విదేశాలకు వెళ్లి వచ్చినవారే.  

 

ఇప్పటివరకూ పాజిటివ్​గా గుర్తించిన 27 మందిని గాంధీ, చెస్ట్ హాస్పిటళ్లలో ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. వైరస్ ఇతరులకు సోకకుండా ఆసుపత్రుల్లో చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాటికి వచ్చేందుకు పేషెంట్లు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే .. రోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ హాస్పిటల్‌‌‌‌ ఉంటే బాగుంటుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. విదేశాలకు వెళ్లిన వారి వివరాలను సేకరించి, వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరైనా ఇండియాకు వచ్చి, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోతే ఇంటెలిజెన్స్‌‌‌‌కు సమాచారం చేరవేస్తున్నట్టు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: