ప్రస్తుత పరిస్థితుల రీత్యా.. భారతీయ రైల్వే మార్చి 31 వరకు రైళ్లు రద్దు చేసిన సంగతి అందరికి విదితమే. ఇక రైళ్లు రద్దు చేయడంతో, ఇప్పటికే టికెట్లు బుక్ చేసినవారిలో ఒకింత టెన్షన్ మొదలవ్వడం సహజం. దీంతో వాటిని క్యాన్సిల్ చేయాలా వద్దా? రీఫండ్ వస్తుందా లేదా? ఇలా అనేక సందేహాలు ప్రయాణికుల్లో కలగడం సహజమే. అయితే, దీన్ని దృష్టిలో ఉంచుకొని.. ఓ క్లారిటీ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. 

 

ఇపుడు మీరు ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసినట్టైతే వాటిని క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. టికెట్స్ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అయిపోతాయి. రీఫండ్ కూడా ఆటోమెటిక్‌ ప్రాసెస్ జరిగిపోతుంది. కాబట్టి, సదరు ప్రయాణికులు వర్రీ కావాల్సిన పని లేదు. ఒకవేళ రీఫండ్ రాని యెడల ఐఆర్‌సీటీసీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లో కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఐఆర్‌సీటీసీలో ఇ-టికెట్ బుక్ చేసినవారికి మాత్రమే కాదు, పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్లు తీసుకున్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. 

 

 

ఇక దీనితో ప్రయాణికులు, టికెట్లు క్యాన్సిల్ చేయడంకోసం రైల్వే కౌంటర్లకు రావాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో.. రద్దీని తగ్గించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటి చర్యలు చేపట్టినందువలన ఈ రకమైన సడలింపులు చేసింది చేసింది రైల్వే. కొత్త నిబంధనల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 21 మధ్య భారతీయ రైల్వే రద్దు చేసిన రైళ్లకు ప్రయాణ తేదీ నుంచి, మూడు నెలల లోపు రీఫండ్ తీసుకోవచ్చు. అంటే మూడు నెలల లోపు రీఫండ్ కోసం ఎప్పుడైనా కౌంటర్‌కు వెళ్లొచ్చని సూచించింది. 

 

ఒకవేళ ఇండియన్ రైల్వే వారు రైళ్లు రద్దు చేయకపోయినా, ప్రయాణికులు ప్రయాణించని యెడల మూడు నెలల లోపు టికెట్ డిపాజిట్ ఫైల్ చేయొచ్చు. సాధారణంగా ఈ నిబంధన మూడు రోజులే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మూడు నెలలకు పొడిగించడం గమనార్హం. సీసీఓ లేదా సీసీఎం క్లెయిమ్ ఆఫీసుల్లో టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. కొత్త నిబంధనలను సదరు ప్రయాణికులు వినియోగించుకోవలసిందిగా... ఇండియన్ రైల్వే సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: