తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ఎక్కడా కనపడటం లేదు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా సరే ప్రజలు మాత్రం గుంపులు గుంపులు గా బయటకు వస్తూనే ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా పాక్షికంగానే ఈ లాక్ డౌన్ కనపడుతుంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, ఇలా ఎక్కడ చూసినా సరే లాక్ డౌన్ పాక్షికంగానే ఉందనే విషయం అర్ధమవుతుంది. ఎన్ని విధాలుగా ప్రజలకు హెచ్చరికలు చేసినా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి కనపడటం లేదు అనే చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం. 

 

కరోనా కట్టడి చెయ్యాలి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్పినా సరే వినడం లేదు. దీనితో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా తీవ్రత చాలా దారుణంగా ఉందని చెప్పినా వినడం లేదు. ఒక్కసారి అది చేయి దాటితే మాత్రం అదుపు చేయడం అనేది దాదాపుగా కష్టమనే చెప్పాలి. దీనితో కేంద్రం రంగంలోకి దిగింది. రోడ్లపైకి జనం భారీగా వస్తున్న నేపధ్యంలో... రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. 

 

ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసారు ప్రధాని. లాక్ డౌన్ ని రాష్ట్రాలు అన్నీ కూడా కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే అని ఆయన స్పష్టం చేసారు. మన దేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ప్రజలు అందరూ కూడా మాట వినాలని ఆయన సూచించారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సహకరించకపోతే మాత్రం పరిస్థితి చేయి దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాక్ డౌన్ ని అమలు చేయడం అనేది తప్పని సరి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: