ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ అతి తక్కువ కాలంలో ప్రపంచాన్ని క‌మ్మేసింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల చాల మంది ప్రజలు భయబ్రాంతులకు గురయ్యాయి. దాదాపు 100 కోట్ల మంది ఇళ్లకే పరిమితమైపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 13,444కు పెరిగింది. దాదాపు 170 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దాదాపు 35 దేశాలు లాక్ డౌన్ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. క‌రోనాను నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

 ప్రధానంగా... చైనా కంటే ఎక్కువ మృతుల సంఖ్యను కలిగివున్న ఇటలీలో న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇటలీ తర్వాత స్పెయిన్, జర్మనీ, అమెరికా, ఇరాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, బ్రిటన్‌లో కూడా కరోనా కేసులు, మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక భార‌త దేశంలోనూ క‌రోనా ప్ర‌భావం చూపుతోంది. భారతదేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 396కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ కట్టడికి పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో క‌రోనా వైర‌స్‌పై అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అందులో సగం నిజం ఉంటే.. సగం అబద్ధాలే ఉంటున్నాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు ఏం న‌మ్మాలో.. ఏం న‌మ్మ‌కూడ‌దో అర్థం కాని ప‌రిస్థితి. ఇక తాజాగా ఉప్పు నీళ్లు పుల‌క‌రిస్తే క‌రోనా రాదు అన్న వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే వాస్త‌వానికి ఉప్పు నీళ్లు శ్వాస సంబంధిత వైరస్‌లను నియంత్రించలేవు. బ్లీచింగ్‌ పౌడర్, ఇథనాల్‌ లాంటివి పులకరించడంతో ప్రయోజనం ఉంటుంది అని వస్తున్న పోస్టింగుల్లో కూడా వాస్తవం లేదు. మ‌రియు ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల‌ చాలా ప్రమాదకరం కూడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: