దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. నిన్న ఒక్కరోజు దేశంలో 19 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. మహారాష్ట్రలో కరోనాతో పిలిప్పీన్స్‌ దేశానికి చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి కన్నుమూసిందని తెలిపింది. నిన్న ఒకరు మృతి చెందగా నేడు మరో మహిళ మృతి చెందడంతో అక్కడ కరోనా తో మరణించి వారి సంఖ్య మూడుకి పెరిగింది. కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణ 27, ఉత్తరప్రదేశ్‌ 27, కర్ణాటక 27, గుజరాత్‌లో 18 మంది ఉన్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415గా ఉంది.   

 

నిన్న అత్యధికంగా ముంబైలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. కర్ణాటకలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు.  ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి సంఖ్య 89కు చేరింది.  కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక వేళ కేంద్రం జారీ చేసిన అజ్ఞనలు ఏమాత్రం ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

 

కరోనా లక్షణాలు ఉన్నవారిని తప్పకుండా వైద్యశాలలో చూపించాలని అంటున్నారు.   ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారు సూచించింది.లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పకుండా పాటించేలా చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిందని పేర్కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: