ప్రపంచం మొత్తం కరోనా ముంగిట మోకరిల్లుతోంది... ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల విధానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఇపుడు మరింత కలవర పెడుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 14650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా బాధితుల సంఖ్య 337533కి చేరుకున్న విషయం తెలిసినదే. 

 

ఇక గడచిన 24 గంటల్లోనే విశ్వవ్యాప్తంగా మరో 1450 మంది మృతిచెందడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇక భారత్ లో ఇప్పటి వరకు ..396 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే, కరోనా వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనా లో మాత్రం పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చినట్టు భోగట్టా. ప్రస్తుతం చైనాలో 90 శాతానికి పైగా కరోనా భాదితులు కోలుకుంటున్నట్లు భోగట్టా. కానీ ఇటలీ లో మాత్రం కరోనా భాదితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం భోగట్టా. 

 

అలాగే కరోనా వల్ల ఇటలీలో మరణిస్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా వుంది. ప్రస్తుత సమాచారం మేరకు, అక్కడ ఇప్పటికే 5 వేలమంది వరకు చనిపోయారు. దీనితో ఇటలీ మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. ఇక కొత్తవిషయం ఏమంటే, ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ వలన ఆఫ్రికా పర్వత ప్రాంత గొరిల్లాకు ముప్పు వాటిల్లనుందని.. పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేసారు. 

 

అందువలన కాంగోలోని విరుంగ జాతీయ పార్కు జూన్ 1 వరకు పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా  నిలిపి వేసింది. ఆ విధంగానే.. కాంగో పొరుగున వున్న రువాండా కూడా పర్యాటకం మూడు జాతీయ పార్కుల్లోని పరిశోధక కార్యక్రమాలను ఆపివేసింది. ఇక పర్వత శ్రేణులకు చెందిన గొరిల్లాలు.. ఊపిరితిత్తుల వ్యాధులకు త్వరగా లోనౌతాయని, సాధారణ జలుబుకి కూడా గొరిల్లా చనిపోయే అవకాశం ఉందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: