తెలంగాణలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు  పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన విడుదల చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనాభా కలిగిన 14 గంటలకు బదులు 24 గంటలు పాటించాలని పిలుపు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... నిన్న ఒక్క రోజు మాత్రమే కాదు జనతా కర్ఫ్యూను మార్చి 31 వరకు పాటించాలని... రాష్ట్రం మొత్తం లాక్ డౌన్  విధిస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రవాణా సంస్థలు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్ని దుకాణాలు షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి. కేవలం ప్రజలకు అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

 

 

 అయితే కరోనా  వైరస్ నియంత్రణకు పోరాటం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ చాలా మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ను  పాటించిన ప్రజలు కూడా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్  నిబంధనలను పాటించడం లేదు. రోడ్ల మీద వాహనాలు సాధారణ పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే పది నుంచి పదిహేను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ను  నియంత్రించడంలో కీలకమైనది అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

 

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా  సమస్య తీవ్రంగా ఉంది కాబట్టే లాక్  డౌన్ ప్రకటించాము అంటూ డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో రోడ్లపైకి వచ్చేందుకు  ప్రజలెవ్వరికి  అనుమతి లేదు అంటూ తెలిపారు. ఎలాంటి వాహనాలు కూడా రోడ్డు పైకి రాకూడదు అంటూ సూచించారు. అయితే కరోనా  వైరస్ పై పోరాటానికి ప్రజల అందరి సహకారం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల దృశ్య అందరూ లాక్ డౌన్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వాహనాలు తెచ్చిన వారికి భారీ జరిమానాలు విడించక తప్పదు  అంటూ స్పష్టం చేశారు. లాక్ డౌన్ లో పాటించని వారిపై  చర్యలు తీసుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: