ఏపీ సీఎం, వైసీపీ అదినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతున్న విష‌యం తెలి సిందే. స‌హ‌జంగానే అధికార ప‌క్షంపై ప్ర‌తిప‌క్షం ఫైర్ అవుతుంది. అయితే, క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై ఒంటి కా లిపై ఎగురుతుండ‌డం, ప్ర‌తి నిర్ణ‌యాన్ని  ఏదో ఒక రూపంలో అడ్డుకోవ‌డం, ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ఏదో ఒక రూపంలో కోర్టుల్లో కేసులు వేయించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు పైచేయి సాధిస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అయితే, బాబు ఇంత‌గా ఫైర్ అవ‌డానికి కార‌ణం ఏంటి? ఎందుకు ఆయ‌న ఇలా రెచ్చిపోతున్నారు? అనే అంశాల‌పై పైపైన కాకుం డా కొంత లోతుగా విశ్లేష‌ణ చేసిన‌ప్పుడు రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

దీనిలో ఒక‌టి రాజ‌కీయం. రెండు వ్య‌క్తిగ‌తం. సాధార‌ణంగా ఏ పార్టీ అయినా ప్ర‌తిప‌క్షంలో ఉందేందుకు ఇష్ట‌ప‌డ‌దు. దీంతో అధికా రంలోకి వ‌చ్చిన పార్టీపై ఏదో ఒక‌ర‌కంగా విమ‌ర్శ‌లు చేయ‌డం, కోర్టుకు వెళ్ల‌డం స‌హ‌జం. ఈ కోణంలో ఆలోచిస్తే.. చంద్ర‌బాబు రాజ‌కీ యంగా న‌లిగిపోతున్నార‌నే చెప్పాలి. ఒక‌వైపు ఘోర ప‌రాజ‌యం పాల‌య్యార‌నే ఆవేద‌న ఆయ‌న‌ను తీవ్ర‌స్థాయిలో వేధిస్తోంది. రెండో సారి కూడా అధికారంలోకి రావాల‌ని ఆయ‌న చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, అధికారం పోయింది.అది కూడా ఘోరంగా ప‌రాజ‌యం పాల‌వ‌డం ఆయ‌న‌ను మ‌రింత‌గా వేధిస్తోంది

.

ఇక‌, గెలిచ‌న ఎమ్మెల్యేలు కూడా ప‌ట్టుమ‌ని ప‌ది నెల‌లు కూడా కాకుండానే ఆయ‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు. దీనంత‌టికీ జ‌గ‌న్ కార‌ణ‌మనే బాధ స‌హ‌జంగానే చంద్ర‌బాబును వేధిస్తోంది. దీంతో చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇక‌, రెండో కార‌ణం.. అత్యంత కీల‌క‌మైన కార‌ణం బాబుకు వ్య‌క్తిగ‌తం. అది ఆయ‌న వ‌య‌సు ఒక‌టి అయితే, దీనిలోనే రెండో కార‌ణం.. త‌న‌ను నమ్ముకుని, భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టిన క‌మ్మ సామ్రాజ్యం కోట‌లు కూలిపోతుండ‌డం. ఇప్పుడు సంధిద‌శ‌లో టీడీపీ ఉంది. బాబు త‌ర్వాత ఎవ‌రు అనే ప్ర‌శ్న వ‌స్తే.. ఎవ‌రూ లేర‌నే స‌మాధానం వ‌స్తోంది. పైగా బాబుకు 70 ఏళ్ల వ‌య‌సు వ‌స్తోంది.



దీంతో ఆయ‌న ఇప్పుడు యాక్టివ్‌గా లేక‌పోయినా.. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గి, స్వ‌రం త‌గ్గించినా కూడా బ్యాడ్ సింప్ట‌మ్స్ వెళ్తాయి. అదే స‌మ‌యంలో బాబు అధికారంలో ఉండ‌గా అటు రాజ‌ధాని లో స‌హా ఇత‌ర ప్రాంతాల్లోనూ క‌మ్మ సామాజ‌కి వ‌ర్గానికి చెందిన నాయ‌కులు భారీ ఎత్తున భూములు కొన్నారు. పెట్టుబ‌డులు పెట్టారు. ఇప్పుడు వాటిపై జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే చంద్ర‌బాబుపై ఒత్తిడిపెరిగింది. ఈ రెండు కార‌ణాల‌తో ఆయ‌న త‌న‌ను తాను నిల‌బెట్టుకునే క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: