తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకు చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ హిట్ అయ్యాక సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే కేసీఆర్ ఈ నెల చివ‌రి వ‌ర‌కు లాక్ డౌన్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించినా సోమ‌వారం ఉద‌యం మాత్రం కేసీఆర్ మాట‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించు కోలేదు. ప్ర‌భుత్వం, అధికారుల మాట‌ల‌ను భేఖాతార్ చేస్తూ ఎవ‌రికి వారు రోడ్ల మీద‌కు వ‌చ్చేశారు. అటు ప‌రిశ్ర‌మ‌లు సైతం లాక్ డౌన్ ప్ర‌క‌టించ లేదు. దీంతో ఎవ‌రికి వారికి ఆందోళ‌న ప్రారంభ‌మైంది.



ఇక సోమ‌వారం ఉద‌యం ప్ర‌జ‌ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎస్ సోమేష్‌తో పాటు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ పెట్టి మ‌రి ఫైర్ అయ్యారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తామ‌ని.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోని వారిపై తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేశామని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇటు కోదాడ‌, సూర్యాపేట వ‌ద్ద ఆంధ్రా స‌రిహ‌ద్దులు.. అటు మ‌హారాష్ట్ర‌తో పాటు క‌ర్నాక‌ట స‌రిహ‌ద్దుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ పూర్తిగా మూసివేసింది. ఎక్క‌డిక్క‌డ రోడ్ల మీద ఐదారుగురికి మించి గుమి కూడ‌వ‌ద్ద‌ని సూచ‌న‌లు జారీ చేశారు.



ఇక రోడ్ల మీద‌కు వాహ‌నాలు వ‌స్తే ఊరుకోమ‌ని... సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదన్నారు. ఈ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి రోడ్ల మీద‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని.. భారీ ఫైన్లు కూడా వేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఒక్క వ్య‌వ‌సాయ అధారిత ప‌నుల‌కు మాత్రం మిన‌హా యింపులు ఇచ్చారు. వ్యవసాయ సంబంధ పనులు ఆపితే ఇబ్బంది అవుతుంది కాబట్టి.. సంబంధిత పనులపై ఆంక్షలు లేద‌ని సీఎస్ సోమేష్ స్ప‌ష్టం చేశారు.  ప్ర‌జ‌లంద‌రూ లాక్ డౌన్‌కు స‌పోర్ట్ చేయాల‌ని... మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్లడానికి అనుమతి ఇస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: