నిరుద్యోగులకు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ -CSL కొత్తగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్‌మ్యాన్, సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులని ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ లో గాను మొత్తం 58 ఖాళీలను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రకటించింది. అలాగే ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన అన్ని వివరాలను https://cochinshipyard.com వెబ్‌సైట్‌ ద్వారా తెలుసు కోవచ్చు.

 

IHG


ఇందుకు గాను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తు చేసుకొనడానికి ఏప్రిల్ 2, 2020 చివరి తేదీ. నోటిఫికేషన్ కి సంబంధించిన మొత్తం ఖాళీలు 58. అందులో
సేఫ్టీ అసిస్టెంట్స్ 24 పోస్టులు, ఫైర్‌మ్యాన్ 34 పోస్టులుఇందులో ఉన్నాయి. ఇందుకు గాను దరఖాస్తు ప్రారంభ తేదీ 2020 మార్చి 18 నుంచే మొదలైంది. ఈ పోస్టులకి గాను విద్యార్హత విషయానికి వస్తే సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులకి 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ సేఫ్టీ లేదా ఫైర్ సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఫ్యాక్టరీలో ఏడాది పాటు శిక్షణ కచ్చితంగా కలిగి ఉండాలి. 

 

IHG


అలాగే ఫైర్‌ మ్యాన్ పోస్టులకి గాను మినిమం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఫైర్ ఫైటింగ్‌ లో 4 - 6 నెలల శిక్షణ కచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చూసుకోండి. ఈ పూర్తి నోటిఫికేషన్ చూడడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి. లింక్ : https://cochinshipyard.com/uploads/career/9726d3ffc5edb9f222cefad1fff8969a.pdf అప్లికేషన్ పూర్తి చేయుటకు సైట్ లోకి వెళ్లి అప్లై చేయవలిసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: