దేశంలో కరోనా పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా దేశంలో 75 జిల్లాలో లోక్ డౌన్ చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది.

 

ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.

 

అయితే ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే అక్కడి జిల్లాపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టారు. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో అధికారులు అప్రమత్తమై ప్రజల్లో చైతన్యం పరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో ఉన్న బృందాలు ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. ఈ పరిస్ధితిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర స్ధాయి అధికారులకు సమాచారం అందజేస్తున్నారు. వారు స్ధానికంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి డేటా సేకరిస్తున్నారు.

 

తాజాగా ఏపీలో మరో కేసు పాజిటివ్ అని తేలింది. ప్యారిస్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దింతో ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాడిని సిద్ధమైంది.

 

కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలనీ, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలనీ అక్కడి ప్రభుత్వం కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: