రైతులకు ఈరోజు రేపు కాసుల వర్షం ఓ రేంజ్ లో కురుస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంత చిగురుటాకులా వణికిపోతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. 

 

నిన్నటికి నిన్న దేశమంతా కర్ఫ్యూ విధించడంతో ప్రజలంతా కూడా నిన్న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఎవరు కూడా బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలుగు రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీ వరుకు షట్ డౌన్ చేశారు. 

 

దీంతో కరోనా వైరస్ కారణంగా ఈ నెల 31 వరుకు ప్రజలు ఎవరు బయటకు రారు.. అందుకే అందరూ కూడా వారానికి కావాల్సిన సరుకులు అన్ని కూడా ముందుగానే కొంటున్నారు.. వారానికి కావాల్సిన కాయగూరలను తిరుకుంటున్నారు. ఇది అదునుగా భావించిన వ్యాపారులు.. భారీగా రేట్లు పెట్టారు..

 

ముఖ్యమంత్రులు బెదిరించిన సరే రేట్లు మాత్రం భారీగానే పెంచేశారు.. తెలంగాణలో అయితే కూరగాయల వ్యాపారులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ధరలు భారీగా పెంచేశారు. కూరగాయల ధరలను అమాంతం పెంచినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

 

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్‌ల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. టమాటా కిలో ధర నిన్నటి వరకు రూ. 8గా ఉంది. ఈ రోజు వ్యాపారులు కిలో రూ.100కి అమ్ముతున్నారు. వంకాయ నిన్నటి వరకు కిలో రూ.15 ఉండగా ఈ రోజు రూ. 80కి, మిర్చి కిలో రూ. 25గా ఉండగా ఇప్పుడు రూ. 90కి అమ్ముతున్నారు. కానీ ధరలు చూశారా ఎంత ఉన్నాయో.. ఇలాంటి ధరలు మొన్న భారీ వర్షాల అప్పుడు కూడా చూడలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: