ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావడంలేదు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచం అంతా వణికిపోతోంది. కరోనా వైరస్ బారిన పది ప్రపంచం అల్లాడిపోతోంది. కొన్ని కొన్ని దేశాలు కరోనా నివారణ తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేసిన పరిస్థితి దాపురించింది. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితిథుల్లో ఈ నెల చివరి తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజా రవాణా మొత్తాన్ని స్థంబింప చేయడంతో పాటు రోడ్ల మీదకు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే సామాన్యుల పరిస్థితి ఏంటి అనే దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. 

IHG


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అప్రమత్తంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నా వీటిని మరింత చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు దారులు అందరికీ 1500 రూపాయలను సరుకులు కొనుగోలు చేసుకునేందుకు ఇస్తామని ప్రకటన చేశారు. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు, రేషన్ బియ్యం, కిలో కందిపప్పు ఇస్తామని ప్రకటన చేశారు. ఇది కాస్త ఊరట నిచ్చే అంశమే. సామాన్యులకు ఇది కొద్దిరోజుల పాటు ఊరట ఇస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, చిరు వ్యాపారులు, రోజు కూలీలు ఇలా అంతా ఉపాధి కోల్పోతున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థలు, చిరు వ్యాపారులు, రోజు కూలీ పనులు అన్నీ ఆగిపోతున్నాయి. రైళ్లు, బస్సులు, క్యాబ్స్, ఆటోలు ఇలా వేటినీ తిరిగేందుకు అవకాశం ఇవ్వడం లేదు. కేవలం నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రమే అనుమతిస్తున్నారు. 


బియ్యం, పాలు, కూరగాయలు వాటికి మాత్రమే అవకాశం ఉస్తున్నారు. అయితే చాలాకాలంగా నిర్మాణ రంగం కుదేలవ్వడంతో సరైన ఉపాధి లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడి పనులు అక్కడే స్తంభించడంతో వీరు ఉపాధిపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి కొంతమేర సాయం అందుతుంది. అయితే నిత్యావసర ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ ను వ్యాపారులు ప్రోత్సహించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి ఆధారం లేని వారి కోసం భోజన సదుపాయాలను కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ఏర్పాటు చేయకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆకలి చావులు పెరిగే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: