దేశంలోని ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయినప్పటికీ దేశీయ విమాన సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఢిల్లీలో విమాన సర్వీసులు కొనసాగుతాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

 

కరోనా దెబ్బకు ఎటూ చూసినా లాక్‌డౌన్ కనిపిస్తోంది. ఢిల్లీలో పాజిటీవ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దేశ రాజధాని సరిహద్దులను మూసివేసి వాహనాలేవీ నగరంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమాన సర్వీసులు కూడా నిలిచిపోతాయని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కేంద్రం మాత్రం విమాన సర్వీసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

 

కరోనా విజృంభిస్తుండటంతో మార్చి 29 వరకు అంతర్జాతీయ విమానాలు సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే దేశీయ విమాన సర్వీసులను మాత్రం నిలిపివేయలేదు. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ ఎప్పటిలాగే పనిచేస్తుందని... కేంద్రం స్పష్టంచేసింది. అయితే ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ ఉండటం, కరోనా భయాలతో ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. ప్రయాణాల డిమాండ్ కూడా విపరీతంగా పడిపోవడంతో.. ప్రయాణించే విమానాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దేశీయ మార్కెట్లో దాదాపు 50% వాటాను కలిగి ఉన్న ఇండిగో, పరిస్థితులు మెరుగుపడే 25 శాతం విమానాలను మాత్రమే నడుపుతామని ప్రకటించింది. 

 

ఇటువంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలకు తీవ్ర నష్టాలు వచ్చే ప్రమాదం ఉండడంతో.. పార్కింగ్ ఛార్జీలను తగ్గించాలని కేంద్రాన్ని కోరాయి ఆయా సంస్థలు. మొత్తానికి ఢిల్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రజా రవాణా స్థంభించిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛందా ప్రజలు పాటిస్తున్నారు. పబ్లిక్ వెహికల్స్ కు అనుమతి లేదు. విమానాలకు మాత్రం అందుకు మినహాయింపు దక్కింది. ఎపుడూ జనసమ్మర్థంతో కిటకిటలాడిన ఢిల్లీ ప్రాంతాలు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. కరోనా దెబ్బకు దేశ రాజధాని కళ తప్పింది. ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో అంతా శాంతి వాతావరణం కనిపిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: