క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. మ‌రోవైపు భార‌త్‌లో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేగుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే.. పదికి పైగా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ అంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించాయి.  అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్ర‌క‌టించారు. ఇక 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే, మొదటగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తారు. 

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు. కేవలం అత్యవసరం అయినవి మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ మార్చి 31 వరకు రద్దు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. అలాగే ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన నేపథ్యంలో కొన్ని వర్గాలకు మాత్రం ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మ‌రి అవేంటో చూసేయండి.  ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టేక్‌ అవే, హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది

 

లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు:
- బ్యాంకులు, ఏటీఏంలకు సంబంధించిన కార్యకలాపాలు
- ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా
- టెలికాం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు
- అత్యవసర వస్తువుల సరఫరా

 

- భద్రతా సిబ్బంది(‍ప్రైవేటు సంస్థలు సహా)
- కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు అత్యవసర సేవలు అందించే అన్ని ప్రైవేటు సంస్థలు
- ఎయిర్‌పోర్టులు, సంబంధిత కార్యకలాపాలు  
- రెస్టారెంట్ల టేక్‌ అవే, హోం డెలివరీ సేవలు

 

- ఫుడ్‌, ఫార్మాసుటికల్‌, వైద్య పరికరాలకు సంబంధించిన ఈ- కామర్స్‌ సేవలు
- ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు, ఆప్టికల్‌ స్టోర్లు, ఫార్మసుటికల్స్‌ తయారీ- రవాణా
- పెట్రోలు పంపులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజెన్సీలు అందుకు సంబంధించిన గోడౌన్లు, రవాణా
- ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, పాలు, పండ్లు, బ్రెడ్‌, కిరాణా సామాన్లు, కోడిగుడ్లు, మాంసం, చేపలు తదితరాల రవాణా

మరింత సమాచారం తెలుసుకోండి: