ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కొత్తగా ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయింది. దాంతో వెంటనే అప్రమత్తమై విజయవాడ అధికారులు జిల్లా మొత్తాన్ని లాక్ డౌన్ చేసేసారు. వన్ టౌన్ లోని మేకావారి వీధి నుండి దాదాపు 3 కిలోమీటర్ల మేర 30 కార్పొరేషన్ డివిజన్లలో ఏ ఒక్కరూ తిరగకూడదని... అలాగే వాహనాల తిరిగేందుకు అనుమతించబోమని ఆంక్షలు విధించారు అధికారులు. అలాగే జిల్లా వ్యాప్తంగా అప్పటికప్పుడు 12 చెక్ పోస్టులు ఆగమేఘాలపై ఏర్పాటు చేసే 144 సెక్షన్ను విధించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి యొక్క వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ అని వచ్చేసరికి ఈ చర్యలను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.




ఇకపోతే కరోనా వైరస్ సోకిన రోగి కుటుంబ సభ్యులను... ఇంకా అతను ఈ రెండు రోజుల్లో ఎవరేవరితో కాంటాక్ట్ అయ్యాడో వారిని కూడా ఐసొలేషన్ వార్డు లో ఉంచి డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... నిత్యవసర సరుకుల విక్రయాలు, అత్యవసర సేవలు ఎప్పటిలాగానే యధావిధిగా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. కూరగాయల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. 




కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుడడంతో.... విజయవాడలో రెండు వందల ప్రత్యేకమైన పడకలతో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజీని కరోనా రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చామని తెలిపారు అధికారులు. ఏదేమైనా ఓవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నానా తిప్పలు పడుతూ చర్యలు చేపడుతుండగా.... మరోవైపు కరోనా వ్యాప్తిని పెంచేందుకు 1024 మంది విదేశీయులు ఆ జిల్లాలోకి ప్రవేశించారు. వారు కనీసం స్వచ్ఛందంగా బయటకి రాకుండా... టెస్టులు చేయించుకోకుండా అందరి ఆగ్రహానికి కారణం అవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిస్థితి దారుణంగా తయారవుతుంటే ఈ విదేశీయులు మాత్రం కరోనా వైరస్ కారియర్లు గా మారి మన దేశానికి పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. ఇప్పటికైనా విదేశీయుల రాకపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే కానీ మన భారతీయుల జీవితాలకి సేఫ్టీ ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: