ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ తన విషపు కోరలను భారతదేశంలో విపరీతంగా చాస్తోంది. ఈ వైరస్ కు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఎటువంటి వ్యాక్సిన్ కనిపెట్టకపోవడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు అయితే చైనా దేశంలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ మొదట చైనా ను అతలాకుతలం చేసింది. అయితే ఆ దేశ మీడియా ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల తమ దేశంలో కేవలం మూడు వేల మరణాలు మాత్రమే సంభవించినట్లు చెప్పుకొచ్చింది.

 

నిన్న మొన్న వైరస్ వ్యాపించిన ఇటలీలోనే రోజుకి 700 మంది చనిపోతుంటే చైనా లో అన్ని రోజులు విలయ తాండవం చేసిన ఈ వైరస్ కేవలం మూడు వేల మందిని బలితీసుకోవడం ఏమిటని అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి.  

 

ఎందుకంటే ఆ దేశ మొబైల్ నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చైనా ఆ దేశంలో కరోనా వైరస్ వలన సంభవించిన మరణాలు దాస్తునట్లు స్పష్టత వస్తుంది. చైనాలో జనవరికి ముందు కొత్త కనెక్షన్స్ పెరిగితే జనవరి-మార్చి మధ్య మాత్రం ఏకంగా కోటి 50 లక్షల ఫోన్ నంబర్లు పనిచేయడం మానేశాయని, ఒక్కో ఫోన్ లో 2 సిమ్ కార్డులు ఉన్నా 75 లక్షల ఫోన్లు వాడటం మానేశారన్నమాట. దీంతో ఇప్పుడు వీళ్లంతా ఎక్కడికి వెళ్లారని, ఎందుకు వీళ్ళు ఫోన్లు వాడటం లేదని అసలు బతికే ఉన్నారా?

 

అంటే అసలైన మరణాల సంఖ్య దాచి పెట్టేందుకు చైనా ఇంతలా భయపడిందా? ఎందుకంటే ఈ వైరస్ ఒక దేశంలోకి చొరబ తే దాని వల్ల జరిగే నష్టం మరీ కోట్లలో ఉంటుందా అని ఇప్పుడు అందరూ విపరీతంగా భయపడుతున్నారు. లేకపోతే ఉన్నట్లుండి కోటి యాభై లక్షల కు పైగా ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడం ఏమిటి? ఎంతైనా కరోనా వైరస్ డేంజర్ మన భారతదేశంలోనే చాలా స్పష్టం గా కనబడుతోంది. 

 

ఇప్పటికే 450 పాజిటివ్ కేసులను భారత్ లో గుర్తించగా కొంతమంది సోషల్ మీడియాలో చెబుతున్నదాని ప్రకారం హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా కూడా వారి లక్షణాలను చెబితే టెస్ట్ చేసేందుకు మెడికల్ కిట్లు అందుబాటులో లేనందువల్ల వారందరినీ ఇంట్లోనే క్వారాంటెన్ లో ఉండి లోకల్ డాక్టర్ ని కలవమని చెబుతున్నారట. ఇదే నిజమైతే దేశంలో రానున్న రోజులు చాలా ఘోరంగా ఉండబోతున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: