తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇక కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు . ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడం ఇక రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో అని బతుకుతుంది. ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని వైరస్ ను నియంత్రించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... అంతకంతకూ కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 

 

 

 ఇక తాజాగా తెలంగాణలో కరోనా  వైరస్ బారిన పడిన వారి సంఖ్య 33 కు చేరింది. ఈ ఒక్క రోజే కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 33 చేరింది . ఇక 33 మందిలో ఒకరు చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా ప్రస్తుతం 32 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉందని... తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా  వైరస్ బారినపడి ఎవరు చనిపోలేదు అంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 

 

 

 అయితే మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా  వైరస్ సంక్రమించగా ... ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగా తెలంగాణ వారికి కూడా కరోనా  వైరస్ మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ వైరస్ లక్షణాలు 14 రోజుల తర్వాత బయటపడడంతో ఒక్కొక్కరుగా తెలంగాణ వాసుల్లో  కూడా కరోనా  వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నియంత్రణకు రవాణా వ్యవస్థ సహా అన్ని మూసి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు కూడా కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజల ఇష్టమొచ్చినట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తెలంగాణ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: