ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృస్టిస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజూ వందల మరణాలు సంబవిస్తున్నాయి.. ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలు జరుగుతున్నాయి.  ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలలో మరణాలు సంబవిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహ మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే కొంత మందికి దీనిపై సరైన అవగాహన లేక బయట ఇష్టమొచ్చినట్లు తిరగడం.. వాహనాలు బయట తిప్పడం చేస్తున్నారు.  తాజాగా ఈ విషయంపై డీజీపీ మహేందర్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.

 

మన సమాజం బాగుండాలని ఆకాంక్షించే వారు నిబంధనలు ఉల్లంఘించరని.. ఒకవేళ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.  ఇదొక భయంకరమైన వైరస్ అని క్షణాల్లో విస్తరించిపోతుందని అన్నారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామని చెప్పారు.  ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

 

అత్యవసర పరిస్థితుల్లో అయితేనే మీ వాహనాలు బయట తిప్పాలి.. లేదంటే వాటిని నిర్థాక్షిణ్యంగా సీజ్ చేసి వైరస్ లేదు అని నిర్థారించుకున్న తర్వాతే ఇవ్వబడతాయి అన్నారు.  ఈ రోజు మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: