తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... ప్రజలను ఇంటికే పరిమితం అయ్యేలా చేసినప్పటికీ... ప్రజలు ఎవరిని ఎక్కడ గుమిగూడ  కుండా కఠిన చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వైరస్ వ్యాప్తి మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య బయటపడగా ప్రస్తుతం తెలంగాణ వాసుల్లో కూడా బయట పడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ మరింత భయాందోళనకు గురవుతున్నారు. 

 

 

 ఇక ఈ వైరస్ కి సరైన విరుగుడు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు మరింత ప్రాణభయం పాతుకు పోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలు షాపింగ్ మాల్స్,  మద్యం దుకాణాలు, పార్కులు, పబ్ లు అన్ని  మూసి వేస్తూ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చిన తెలంగాణ సర్కార్. మార్చి 31 వరకు లాక్ డౌన్  ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ప్రజల అందరి సహకారం కావాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు,  రైళ్లు  ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కనీసం ఆటోలు కూడా కనిపించడం లేదు. 

 

 

 రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక ఎవరిని రోడ్డుపైన కి కూడా రానివ్వడంలేదు పోలీసులు. అందర్నీ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే కొత్త దందా స్టార్ట్ చేశారు ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్సుల యజమానులు . హైదరాబాద్ నుంచి విజయవాడ కి మనిషికి ఏకంగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్సులు కానీ, రైలు కానీ,  ఆటోలు కానీ లేకపోవడంతో వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు చాలామంది. ఇక ఈ విషయం తెలియక ఆంబులెన్స్ కదా అని పోలీసులు కూడా క్లియరెన్స్ ఇస్తున్నారు. దీంతో ఏదైనా అంబులెన్స్ లో  ప్రయాణికులను తరలిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అందరినీ మోసం చేస్తూ ఇది యథేచ్ఛగా  అక్రమ దందా కొనసాగిస్తున్నారు ప్రైవేట్ అంబులెన్స్ లా  యజమానులు. ఇక కోదాడలో ఇదంతా గుట్టు రట్టయ్యింది. దీంతో అక్రమ ప్రయాణికుల రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: