కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశం లో రోజు రోజుకీ పెరుగుతుండడంతో జన సమూహం ఏర్పడకూడదనే ఉద్దేశంతో ఈనెల మొదటి వారం లో కేవలం హై ప్రొఫైల్ కేసులను మాత్రమే తమ న్యాయవాదులు వాదిస్తారని... మిగతా కేసులని టేకప్ చేయబోమని... మీడియా ప్రతినిధులకు, సామాన్య వ్యక్తులకు సుప్రీం కోర్టు లోకి అనుమతి లేదని సుప్రీంకోర్టు అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే మాట్లాడుతూ... ఈరోజు నుండి వ్యక్తిగత వాదనలు అసలు ఉండవని స్పష్టం చేస్తూ... మళ్లీ తదుపరి ప్రకటన విడుదల చేసేంతవరకు ఈ ఆదేశాలకు అందరు కట్టుబడి ఉండాలని తెలిపారు.




అలాగే రేపు అనగా 24 వ తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రాంతం లో న్యాయవాదుల చాంబర్లకు సీల్ వేస్తున్నామని తెలిపారు. అయితే అర్జంట్ కేసులను వినడానికి ఓ సరిక్రొత్త పద్ధతిని కనుగొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని... ఒక వెబ్ సైట్ లింక్ ప్రతి ఒక్క సుప్రీం కోర్టు న్యాయవాదికి ఇవ్వబడుతుందని... ఆ లింకు పై క్లిక్ చేసి ఓ వీడియో కాన్ఫరెన్స్ లో చేరితే ఏ న్యాయవాది అయినా ఇంట్లోనే కూర్చొని అత్యవసర కేసుల పిటిషన్లపై వాదించవచ్చని బొబ్డే వెల్లడించారు. అయితే సుప్రీం కోర్ట్ చాంబర్లను మూసివేస్తున్న క్రమంలో న్యాయవాదులు వారి కేసులకు సంబంధించిన పట్టాలను తీసుకోవాల్సి ఉండగా... రేపటి సాయంత్రం వరకు సమయం ఇచ్చారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.




ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా 13 వేల మంది కరోనా వైరస్ కారణంగా చనిపోగా... మనదేశంలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. నావెల్ కోవిడ్ 19 వ్యాధి వ్యాప్తి నేపథ్యం లో మిగతా న్యాయస్థానాలు ఏప్రిల్ 4 వరకు మూసివేయబడతాయని తెలుస్తుంది. మార్చి 5వ తేదీన ఉన్నత వైద్యాధికారులు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పరిగణలోకి తీసుకొని... కేవలం హై ప్రొఫైల్ కేసులను మాత్రమే విచారించడం జరుగుతుందని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: