ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ముప్పావుగంటలోనే కరోనా ఉందో.. లేదో తెలుసుకునే టెస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే అమెరికా ఎఫ్డీఏ దీనికి అనుమతి ఇవ్వగా.. ఈ వారం నుంచి అది అమెరికా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానుంది. ఈ టెస్ట్ తో కరోనా కేసుల సంఖ్య వేగంగా తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. 

 

అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి వణికిపోతోంది. సాధారణంగా ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా.. పరిష్కారం చూపించడానికి అమెరికా ముందుంటుంది. అలాంటిది కరోనాను కంట్రోల్ చేయడం మాత్రం యూఎస్ వల్ల కావడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో బెంబేలెత్తుతోంది. ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ అమల్లో ఉండగా.. నాలుగైదు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. 

 

రోజూ వేలల్లో అనుమానితులు వస్తుండటంతో.. వీళ్లకు కరోనా ఉందో.. లేదో చెక్ చేయడం వైద్యులకు తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టుల ప్రకారం అయితే.. ఫలితాలు రావడానికి 24 గంటల నుంచి నాలుగు రోజుల వరకు టైమ్ పడుతోంది. ఈలోగా మరింతమందికి కరోనా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్డీఏ కొత్త కరోనా టెస్ట్ కు అనుమతిచ్చింది. ఈ టెస్ట్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే కరోనా ఉందా.. లేదా అనే సంగతి కన్ఫామ్ చేయొచ్చు. 

 

ఈ వారం నుంచి అమెరికా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొత్త కరోనా టెస్ట్ అందుబాటులోకి రానుంది. ఈ టెస్ట్ తో కరోనా బాధితుల్ని వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శనివారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ సంగతి ప్రకటించారు. మొత్తానికి కరోనా ఉందో లేదో వేగవంతంగా తెలుసుకునేలా న్యూ టెక్నాలజీ వచ్చేసింది. కేవలం ముప్పావు గంటలో రోగ నిర్ధారణ తెలుసుకునే వీలు వస్తుండటంతో వైద్యులు ఊపిపీల్చుకునే పరిస్థితి వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: