కరోనా మహమ్మారి ముంచుకు వస్తుంది. సునామీ కంటే అత్య౦త వేగంగా ఈ రోగం మన జీవితాలను నాశనం చేయడానికి వచ్చేస్తుంది. ఎవడో చేసిన తప్పుకి పుట్టిన రోగం అది. ఆ రోగం మనం అదుపు చేయలెం. ఒక్కసారి గనుక అది చెలరేగిపోతే మాత్రం ఇప్పుడు దేశంలో పరిస్థితి అదుపు చేయడం అనేది మన వల్ల కాని పని. కాబట్టి అందరూ మేల్కొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ కట్టడి అనేది మన అప్రమత్తత తో సాధ్యం. 

 

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ఏ రాష్ట్రం చూసుకున్నా సరే ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకున్నవే. తెలుగు రాష్ట్రాలతో దాదాపు ఆరు రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుని ఉన్నాయి. ఓడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దులను పంచుకున్నాయి. ఈ సరిహద్దులను పంచుకున్న రాష్ట్రాలు అన్నీ కూడా కరోనా బారిన పడ్డాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా బారిన పడ్డాయి. ఇప్పుడు మన దేశంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర నుంచి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

కాబట్టి అక్కడ ఉండే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలో దాదాపు 90 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయం అందరికి తెలుసు. మహారాష్ట్ర తో మన తెలంగాణా... భారీగా సరిహద్దుని పంచుకుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దు. అలాగే కర్నాటకకు ఆంధ్రప్రదేశ్ కూడా సరిహద్దుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి అయినా చావు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబాట్టి... అందరూ చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: