బాబోయ్ కరోనా మనుషులను చంపుకు తింటుంది.. కాగా బ్రతికున్న వారిని దళారులు దోచుకు తింటున్నారు.. ఇలాంటి వారిని పందికొక్కులు అన్న తక్కువేమో.. ఇకపోతే చావు ఇంటి గడప ముందు ఉంది. బయటకు గడపదాటి ఎవరు రాకండి బాబు అంటే ఎవరైనా వింటున్నారా.. అసలే వినడం లేదు..

 

 

జనతా కర్ఫ్యూ అంటే ఇదేదో ఎలక్షన్ ర్యాలి అనుకుంటున్నారేమో.. లేక అధికారులు అష్టాచమ్మా ఆడుకోవడానికి పెట్టిన బందు అనుకున్నారేమో ఎవరు మాట వినడం లేదు.. మనుషులు ఎంత నీతిమాలిన బ్రతుకులు బ్రతుకుతున్నారు. కనీసం కరోనా వచ్చి చచ్చిన శవాన్ని కూడా చూడడానికి పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అనే భయంతో బ్రతకవలసింది పోయి మాకేం కాలేదు మేము హయిగానే ఉన్నామని భావిస్తూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు..

 

 

ఒకవైపు ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రధాని పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’ కూడా విధించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ రోడ్లపై జాలీగా తిరిగేందుకు బైకులపై బయల్దేరారు. కాగా ఇలాంటి బాధ్యతలేని వారి పట్ల హైదరాబాదు పోలీసులు గులాబీ పూవ్వులిచ్చి తిరిగి ఇంటికి వెళ్లాలని కోరారు.

 

 

అయితే, పుణె పోలీసులు అలా చేయలేదు. బయట తిరుగుతున్న వ్యక్తులతో గుంజీలు తీయించారు. మళ్లీ బయటకు రావద్దని హెచ్చరించారు. మరికొన్ని చోట్ల అయితే పిర్రలమీద వాతలు వచ్చేదాక కొడుతున్నారు.. ఇక ప్రస్తుతం తప్పు చేసిన వారితో గుంజీలు తీపిస్తున్న వారి వీడియో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

 

 

ఒకరకంగా ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారికి ఈ చిన్న శిక్షలు ఏం సరిపోతాయి.. ఇప్పటికే ఇటలీ మొత్తం శవాల గుట్టలు పేరుకుంటున్నాయి.. అమెరికా కూడా గజగజ వణికిపోతుంది..దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.. కాగా ప్రజలు సహకరించకుంటే ఎవరేమి చేస్తారు.. ఈ కరోనా ఆగిపోవాలన్నా, వ్యాపించాలన్నా ప్రజల సహకారం తప్పని సరి.. అందుకే ఆలోచించండి.. ఆనందంగా బ్రతుకుతారా.. అనాధ శవాల్ల చస్తారా.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: