తెలంగాణాలో కరోనా వ్యాప్తి అనేది చాలా వేగంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ అక్కడ అత్యంత వేగంగా విస్తరిస్తూ అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కోసం అక్కడి ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఒక్క రోజే కరోనా కేసులు ఆరు కొత్తవి నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా దిగాజారుతుందో అర్ధం చేసుకోండి. కరోనా వైరస్ అనేది ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తుంది. దీనిని అడ్డుకోవడం అనేది ప్రభుత్వాలకు సాధ్యం అయ్యే పని కాదు. 

 

ప్రజలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య... 33 కి చేరుకుంది. ఏ విధంగా వస్తుందో ఎలా వ్యాపిస్తుందో అర్ధం కావడం, లేదు ఎవరికి. కరోనా అనేది గాలి కంటే వేగంగా ఉందని పరిశోధకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అంతర్జాతీయ పరిచయాలు ఎక్కువ. హైదరాబాద్ అనేది ఇండియా సిలికాన్ వ్యాలీగా ఉంది. ఇక్కడ ఐటి రంగం ఎంతో వేగంగా విస్తరించింది. కాబట్టి విదేశాల నుంచి ఎందరో వచ్చి ఉంటారు. కరోనా కట్టడి చేయడానికి తెలంగాణా ప్రభుత్వం ముందు ఉన్న సవాల్ ఇదే. 

 

కరోనా అనేది ఆ రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. కెసిఆర్ నిధులు కేటాయించినా... అధికారులు కంటి మీద కునుకు లేకుండా పనులు చేసినా సరే కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. కాని ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దు. మీరు చేయవలసింది ఒక్కటే, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండి ప్రభుత్వానికి మీ వంతు సహకారం అందించడమే. మీరు బయటకు వస్తే మీ ప్రాణాలతో పాటుగా దేశం, రాష్ట్ర౦, జిల్లా ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్టే అనే విషయాన్ని గుర్తు ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: