కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎంత  టార్చర్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలి అంటే ప్రజలకు అంత ఈజీ కాదు మరి.. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మృతి చెందారు. ఇప్పటికే 15వేలమంది మృతి చెందారు.. 3 లక్షలకు పైగా ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. 

 

IHG

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించి మనుషులను చంపుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక్కరు కూడా బయటకు రాకుండా పోలీసులను పెట్టారు. బయటకు వస్తే అరెస్ట్ చేసేసి లోపల వేస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ముంబైకు చెందిన 68 ఏళ్ళ వృద్ధుడు కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ ముంబై ఆస్పత్రిలో సోమవారం మరణించాడు. మృతి చెందిన వృద్ధుడు ఫిలిప్పీన్స్‌కు చెందిన వ్యక్తని అధికారులు తెలిపారు. మొదట ఇతనికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో స్ధానిక కస్బూర్బా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

 

IHG

 

అనంతరం కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో అతనిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే అయన ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అతను కరోనా వైరస్ బారి నుండి తప్పించుకున్నప్పటికీ మధుమేహం, ఆస్త్మా, శ్వాసకోశ ఇబ్బందుల నుండి అతను తప్పించుకోలేకపోయారు అని.. ఆ ఇబ్బందుల నుండి అతను ఆస్పత్రిలో చేరారు. కాగా అతను ఫిలిప్పీన్స్‌ వ్యక్తి కోవిడ్‌-19తో మరణించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: