కరోనా దెబ్బ మన దేశం మీద గట్టిగా పడింది అనే మాట అక్షరాలా నిజం. ఆర్ధికంగా నిలబడుతున్న దేశం మనది. ఆర్ధికంగా ప్రపంచానికి పోటీ ఇస్తున్న దేశం మనది. ఈ తరుణంలో కరోన వైరస్ అత్యంత వేగంగా విస్తరించి మన దేశ ఆర్ధిక వ్యవస్థ నెత్తి మీద కూర్చుంది. కరోనా వైరస్ కట్టడికి చర్యలు ఏ విధంగా తీసుకునే పరిస్థితిలో ప్రపంచ దేశాలు లేవో... ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచడానికి కూడా ఇప్పుడు  ప్రపంచ దేశాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఆర్ధికంగా ఎంతో బలమైన దేశాలు ఇప్పుడు కరోనా బారిన పడ్డాయి. 

 

మన దేశంలో కరోనా వైరస్ దెబ్బ కూలికి వెళ్ళే వాడి నుంచి టాటా కంపెనీ వరకు పడింది. దీనిని అదుపు చేయడం అనేది సాధ్యం కావడం లేదు. అయితే స్టాక్ మార్కెట్ లు మాత్రం భారీగా కుప్ప కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. సోమవారం చాలా వరకు లాభాల్లో ఉంటాయి మార్కెట్ లు. కాని ఏ దశలోనూ కోలుకునే స్థితిలో మార్కెట్ లు లేవు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. మన దేశంలో స్టాక్ మార్కెట్ లు ఆర్ధిక వ్యవస్థ మీద చాలా వరకు ప్రభావం చూపిస్తాయి. అలాంటి మార్కెట్ లు ఇప్పుడు ఈ విధంగా పడిపోవడం అనేది నిజంగా ఆందోళన వ్యక్తం చేసే అంశం. 

 

ఇక బంగారం ధరలు కూడా భారీగా పడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎన్ని విధాలుగా చూసినా ఆర్ధిక వ్యవస్థ కరోనా నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేయలేకపోతున్నట్టే, కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థ మీద కొడుతున్న దెబ్బను కూడా అంచనా వేయలేని పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఐటి కంపెనీలు సహా చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా కుప్ప కూలిపోయే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: