రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడంలో కొద్దిగా స్పీడ్ తగ్గించారు. 2014 తర్వాత సినిమారంగంలో చాలా యాక్టివ్ అయిన చిరంజీవి ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేయడం జరిగింది. తాజాగా మూడో సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. 'ఆచార్య' అనే టైటిల్ కలిగిన ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల షూటింగులు అన్ని బంద్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమితమయ్యారు.

 

ఒక సినిమా రంగానికి చెందింది మాత్రమే కాక దేశంలో ఉన్న అన్ని రంగాలు మూతపడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ...దేశ ప్రధాని మోడీ తీసుకున్న జనతా కర్ఫ్యూ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మార్చి 22 నుండి 31 వరకు బందు పాటించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుం బిగించారు. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు చనిపోయిన తరువాత కొద్దిగా పెద్దదిక్కు లాగా చాలా విషయాలలో చిరంజీవి ఇన్వాల్వ్ అవుతూ తన తోటి నటీనటులను సహకరించుకుంటూ ముందుకు పోతూ ఇటీవల చాలా యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసినదే.

 

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్నచిన్న హీరోల సినిమా ఆడియో వేడుకలకు హాజరు అవుతూ...వాళ్లని ఎంకరేజ్ చేస్తూ పైకి రావాలని కోరుకుంటున్నా చిరంజీవి ప్రస్తుతం...కరోనా వైరస్ వల్ల ఇండస్ట్రీలో ఉపాధిలేక కోల్పోయిన వాళ్లకి...కొంత ఉపాధి అందించడానికి రెడీ అవుతున్నట్లు పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్నట్లు, టాలీవుడ్ ఇండస్ట్రీకి కష్టపడే కార్మికులకు ఆపద్బాంధవుడిగా చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: