ఈ రోజుల్లో జాబ్ దొరకటం కూడా చాలా కష్టంగా మారింది. ఉన్నత చదువులు చదివిన వారికీ ఉద్యోగం దొరకటం కష్ట తరంగా మారింది. అలాంటి వారి కోసం కొందరు ఇంటి దగ్గర ఉండే సంపాదించుకునేలా ఉపాధి అవకాశాలు కల్పించుస్తున్నారు.

 

మరి కొంత మంది వేరే వర్క్ చేస్తూనే ఇంట్లో ఇంకో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకవైపు ఇంట్లో ఉంటూనే, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడం కత్తి మీద సామే. ఆఫీసుకి వెళ్లకుండా ఇంటి పనులు చూసుకుంటూ, జాబ్​ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. 

 

ఒక్కేసారి రెండు పనులు చేయాలి అంటే వారికీ ఒక్క ప్రణాళిక,టైం మేనేజ్​మెంట్​ ఉండాలి. ఆలా ఉన్నపుడే ఏ పని అయినా విజయవంతంగా సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చొని పనిచేయటం కత్తి మీద సాము లాంటిదే. ఒక్కే దగ్గర కూర్చోవటం ఎవరికీ సాధ్యం కాదు.

 

పని చేసే వాతావరణం బట్టి పని మీద ఆసక్తి పెరుగుతుంది. కొన్ని చోట్ల వాతావరణ సరిగ్గా లేకున్నా మనం మంచి వీధేర్ ను క్రియేట్ చేసే విధంగా ఉండాలి. ఆఫీస్​ వర్క్​లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా అని టైం వేస్ట్​ అవుతుంది. ల్యాప్​టాప్, పుస్తకాలు, ఫైళ్లు దగ్గరే ఉంచుకోవాలి. ఇవి కానీ పిల్లలు కంటపడితే విలువైన సమాచారం మాయమయ్యే చాన్స్ ఉంది. అందుకే విడిగా​ స్పేస్​ పెట్టుకోవాలి. పని వేళలను నచ్చినట్టుగా సెట్​ చేసుకుంటే వర్క్​ హాయిగా చేసుకోగలుగుతారు.

 

ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే పని మొదలుపెట్టాలి. ఎర్లీ మార్నింగ్ లేదా నైట్​ టైంలో ప్లాన్​ చేసుకుంటే వర్క్​కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు ఒక్కోసారి విజయం రాకపోవచ్చు. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కాన్ఫిడెంట్​గా పని చేస్తే, వచ్చే డెడ్​లైన్​ టెన్షన్​ ఉండదు. బలాలు పెంచుకుంటూ, బలహీనతలను కూడా తగ్గించుకుంటూ పోవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: