ఒకపక్క ఇటలీ, ఇరాన్ మరియు అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తూ ఉంటే భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండి కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారి ప్రజలను బయటకు రానివ్వకుండా లాక్ డౌమ్ చేస్తుంటే మొట్టమొదటిసారిగా పంజాబ్ ప్రభుత్వం వారి ప్రజలు లాక్ డౌన్ పై విధించిన రూల్స్ను అధిగమించడం వల్ల పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు. ఇప్పుడు మహారాష్ట్ర కూడా పంజాబ్ బాటలోనే నడిచి పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించింది.

 

ఇకపోతే కర్ణాటకలో ప్రభుత్వం వారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదు కాగా కొత్తగా వారు తీసుకుని వచ్చిన రూల్ ప్రకారం ఎవరైనా కారణం లేకుండా రోడ్డుపైన తిరిగితే నేరుగా తీసుకుని వెళ్లి జైలులో వేస్తారట. అది కూడా కనీసం బెయిల్ కు కూడా నోచుకోని కేసు కింద. కాబట్టి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. కొద్దిరోజులు శాంతిభద్రతలను కాపాడాలని కర్ణాటక ప్రభుత్వం చాలా గట్టి తరహాలోనే హెచ్చరించింది. దీంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్ళలోనే గడుపుతున్నారు తప్ప బయటకు వచ్చే సాహసం ఎవరూ చేయటం లేదు.

 

ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ విషయానికి వస్తే రెండు రాష్ట్రాలు నెల 31 తారీఖు వరకు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించేశాయి. కేవలం కుటుంబంలో ఒకరిని నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే బయటికి అనుమతిస్తూ ఉండగా 10 మంది కన్నా ఎక్కువ జనం ఒకచోట గుమిగూడితే పోలీసులు వారి లాఠీలకు పని చెబుతున్నారు. ఇకపోతే సమయంలో ఆస్పత్రులు మరియు మందుల షాపులు మాత్రమే 24 గంటలు తెరిచి ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యలో అసలు ఎవరు రోడ్డులో తిరగడానికి వీల్లేదు అని కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: