దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య 415కు చేరగా కొత్త కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 33కు చేరింది. మహారాష్ట్రలో 89 కరోనా కేసులు నమోదు కాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించారు. ఈరోజు నుంచి జిల్లా సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
కరోనా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని అనేక రంగాలపై కరోనా ప్రభావం పడుతోంది. ప్రధాని మోదీ కరోనాను ఎదుర్కొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమిస్తున్నట్లు ప్రకటన చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనాను కట్టడి చేసేందుకు వచ్చే విరాళాలను ఉపయోగిస్తున్నామని అన్నారు. కరోనా దెబ్బతో అన్ని రంగాలు దెబ్బ తినడంతో మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
కేంద్రం కరోనాతో దెబ్బ తినే రంగాలను ఆదుకోవడానికి ఉద్దీపన ప్యాకేజ్ ను ప్రకటించనుంది. ఈ ప్యాకేజ్ ద్వారా కేంద్రం దెబ్బ తిన్న రంగాలను ఆదుకోనుంది. పార్లమెంట్ లో విపక్ష కాంగ్రెస్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజ్ ను ప్రకటించాలని డిమాండ్ చేసింది. దేశంలోని అన్ని రంగాల పరిస్థితి బాగా లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా భారీన పడి మృతి చెందిన వారి సంఖ్య 8కు చేరింది. కేంద్రం దేశంలోని 80 జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది. ఆ జిల్లాలలో కేవలం కేవలం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: