ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఇప్పుడు భారత దేశంలో కూడా తన పంజా విసురుతూనే ఉంది. తాజాగా భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఒక వ్యక్తి కరోనా వ్యాధితో చనిపోయాడన్న వార్త దుమారంలా వ్యాపించింది ఇప్పుడు అక్కడ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజా సర్వే ప్రకారం   మనదేశంలో ఇప్పటి వరకు 457 కరోనా కేసులు నమోదయ్యాయి.  అందులో 23  మంది  పేషెంట్లు ప్రస్తుతం  కోలుకున్నారు.  415 మంది పాజిటివ్ కేసులు  కేసులున్నాయి. కరోనా వ్యాధితో  ఇప్పటికే 8 మంది చనిపోయారు.  కోవిడ్-19  వైరస్  కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని   చర్యలు తీసుకుంటున్న  గాని,  వ్యాధి  తీవ్రత  గురించి  ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా  గాని   రోజు రోజుకూ  పాజిటివ్  కేసుల సంఖ్య పెరుగుతోంది.

 

 

 


 కరోనా మరణాలు సైతం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని ఈ మహమ్మారి బలితీసుకుంది.  తాజాగా కరోనా వ్యాధితో భారత్‌లో మరొకరు చనిపోయారు. పశ్చిమ  బెంగాల్‌లో 55 ఏళ్ల కరోనా పేషెంట్ సోమవార మధ్యాహ్నం మరణించారు.ఆ వ్యక్తి  పశ్చిమ బెంగాల్ లోని  దుమ్‌దమ్‌కు చెందిన  వ్యక్తి.  ఈయన సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతుడికి అప్పటికే అవయవాలు పూర్తిగా పాడయ్యాయని.. గుండె పోటు కూడా రావడంతో మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకి  అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ వైరస్ శరీరంలో చేరి వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా  క్షిణింపచేస్తుంది. అంతేకాకుండా ముసలివాళ్ళకి, చిన్నపిల్లలకి త్వరగా  వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ తో  పశ్చిమ బెంగాల్‌లో ఇదే  తొలి  మరణం  కావడంతో  అటు  ప్రజల్ని, ఇటు అధికారులని కలవరపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: