అవును ఇది కరోనాకు ఆరంభం మాత్రమే... అంత౦ కాదు. ప్రపంచం ముందు ముందు మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్దం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా అనేది ఇప్పట్లో కంట్రోల్ అయ్యే విధంగా కనపడటం లేదు. దాదాపు 190 దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. ఈ దేశాలు అన్నీ కూడా తమ పౌరులను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రజలు కూడా ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ అనేది మన దేశంలో కూడా వేగంగా పాకుతుంది. 

 

రోజు రోజుకి కేసుల సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ కేసులను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అనేవి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అంతం కాదు.. ఆరంభం. మున్ముందు ఇంకా వేగంగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అన్ని దేశాలకు కూడా ఈ వ్యాధి విస్తరించడం, వ్యాపించడం అక్కడ ఇబ్బంది పెట్టడం, మరణ శాసనం రాయడ౦ అనేది ఖాయంగా కనపడుతుంది. దీన్ని అదుపు చేయడానికి మందు లేదు. మందు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రాంతానికి ఒకరికి వచ్చినా గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, రాష్ట్రాలు తుడిచేస్తాయి. 

 

దేశ వ్యాప్తంగా కరోనా బీబత్సం మున్ముందు ఇంకా ఉంటుంది. మన దేశంలో ఇప్పుడు బాధితుల సంఖ్య చాలా తక్కువ. రెండో దశలో ఉంది కరోనా. ఇది మరింతగా వేగం పుంజుకుని మూడో స్టేజ్ కి వెళ్తే ఆ తర్వాత నాలుగో స్టేజ్ కి వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదని అంటున్నారు. కరోనా ఇప్పుడు ఎక్కువగా ఇటలీ అమెరికా సహా పలు దేశాల్లో నాలుగో స్టేజ్ లో ఉంది. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా దీన్ని లైట్ తీసుకోవద్దు. మన జనాభా అనేది ఎక్కువ. దాదాపు 140 కోట్ల మంది ఉన్న దేశం మనది.

మరింత సమాచారం తెలుసుకోండి: