దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు దేశంలో ఉన్న 80 జిల్లాల్లో ఈ లాక్ డౌన్ అనేది అమలు జరుగుతుంది. ఇక కొన్ని రాష్ట్రాలు అయితే పూర్తిగా లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు అన్నీ కూడా లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు లాక్ డౌన్ కి ఏ మాత్రం సహకరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సోషల్ మీడియా లో కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం సహకరించడం లేదు. 

 

మన తెలుగు రాష్ట్రాల్లో పని లేకపోయినా సరే బయటకు వస్తున్నారు. ఆడుకోవడానికి, చుట్టాల ఇళ్ళకు వెళ్తూ చికాకు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నెల 10 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే అన్ని విధాలుగా కరోనా కట్టడికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు మరింత ముందుకి వెళ్లి... దీన్ని కట్టడి చెయ్యాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏ మాత్రం కూడా అలసత్వం వద్దని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

 

ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలను పూర్తిగా కట్టడి చేయడానికి గాను ఎమర్జెన్సి ని ప్రకటించే యోచనలో మోడీ సర్కార్ ఉంది. ప్రజలు బయటకు వస్తే లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి సిద్దమవుతుంది. అవసరం అనుకుంటే దీనిపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: