తెలంగాణలో రోజురోజుకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్ పై రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ ను  తరిమికొట్టేందుకు తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరు ఇంటి గడప దాటి బయటకు రాకూడదు అని... అంతేకాకుండా అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు పూర్తిగా మూతపడతాయి  అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. 

 

 

 ఏకంగా తొమ్మిది రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించడంతో... ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక ప్రజలు లాక్ డౌన్ ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా కూరగాయల వ్యాపారులు అందరూ ఒక్కసారిగా ధరలు పెంచేశారు. దీంతో నిత్యావసర ధరలు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య ప్రజలు కనీసం కన్నెత్తి కూడా చూడలేనంత ఎక్కువగా కూరగాయల ధరలు పెంచుతున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 

 ఇక కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనం...  ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ లో నుంచి కూరగాయలను లూటీ చేశారు. చేతికి అందిన కూరగాయలను ఎత్తుకెళ్లారు జనం. దీంతో ఫిర్యాదులోని రైతు మార్కెట్ లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు అందరూ ఒక్కసారిగా జనం మొత్తం కూరగాయలు ఎత్తుకోవడం మొదలుపెట్టడంతో ఏమీ అర్థం కాక షాక్ లో మునిగిపోయారు. అక్కడున్న జనాన్ని ఆపడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడి ప్రజలందరూ చేతికందిన కూరగాయలను ఎత్తుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: