కరోనా వైరస్ ను నివారణ చేయడం కొరకు, భారత ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది.. ఇపుడు ఆ కోవలోనే దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విమానయాన శాఖ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం విదితమే. ఇక తాజాగా దేశీయ సర్వీసులను సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా మంగళవారం అర్ధరాత్రి నుండి, ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. 

 

అయితే, కార్గో విమానాలపై మాత్రం ఆంక్షలు ఉండవని స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటికే మన దగ్గర  రైళ్లను కూడా రద్దు చేసిన విషయం విదితమే. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో బస్సులు, ట్యాక్సీలు, కార్లు, బైకులు, లారీలు.. ఇతర వాహనాలను కూడా మనం సీజ్ చేయడం చూస్తూనే వున్నాం. కేంద్రం కేవలం సరుకు రవాణా రైళ్లను మాత్రమే నడపడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజారవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

ఇక ఇప్పటి వరకూ తక్కువలో తక్కువగా, ఢిల్లీతో పాటుగా... ఇతర నగరాలకు విమానయాన సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వలన, దేశం మొత్తం లాక్‌డౌన్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక దేశ సరిహద్దుల విషయంలో కూడా భారత్ ఖచ్చితత్వాన్ని పాటించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే సరిహద్దులను పూర్తిగా మూసివేసింది.

 

కేంద్ర ప్రభుత్వం దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కేంద్రంతో పాటుగా  తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ స‌హా ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా కీల‌క నిర్ణయం తీసుకుని, ఇకపై కోర్టుకు వచ్చి వాదనలు వినిపించాల్సిన పనిలేదని, న్యాయ‌వాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: